wife murdered by husband in Visakhapatnam: విశాఖపట్నం జిల్లా శ్రీహరిపురం గొల్లలపాలెంలో దారుణం చోటు చేసుకుంది. భార్య మాధవిని భర్త శివనాగేశ్వర రావు హత్య చేశాడు. భార్యను హత్యచేసి అనంతరం అతనూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గొల్లలపాలెంలో నివాసముంటున్న దంపతులు మాధవి, శివనాగేశ్వరరావు. ఆలుమగల మధ్య అనుమానం పెనుభూతంగా మారింది.
Vishaka couple death news: ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న భర్త శివనాగేశ్వరరావు.. ఇవాళ ఆమెను ఇనుప డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. అనంతరం తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.