ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రద్దైన ఏయూ పాలకమండలి - council

విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. గడువు పూర్తి కావడంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రా విశ్వ విద్యాలయం

By

Published : Feb 19, 2019, 2:54 PM IST

విశాఖ ఆంధ్రా విశ్వ విద్యాలయంలో పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. పాలకమండలి గడువు పూర్తికావడంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులతో కూడిన పాలకమండిలి మాత్రం కొనసాగనుంది. 2016 ఫిబ్రవరిలో పాలకమండలి నియామకం జరిగింది. గవర్నర్​ అనుమతి ఉన్నంత వరకూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో నిర్దేశించారు. విశ్వ విద్యాలయ పాలకమండలకి మూడేళ్ల కాల పరిమితి మాత్రమే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
విశ్వ విద్యాలయానికి పాలకమండలిలో కేటగిరీ -1, కేటగిరీ -2 ఉంటాయి. కేటగిరీ-1 లో సభ్యులుగా వీసీ, ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖ అధికారులుంటారు. కేటగిరీ -2 లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సభ్యులుగా ప్రభుత్వం నియమిస్తుంది. కేటగిరి -2 లో ఉన్న 8 మంది పదవీకాలం ముగిసింది. ఈ నెల 2 తో గడువు ముగిసినప్పటికీ, 8 న జరిగిన పాలకమండలి సమావేశంలో వీళ్లు పాల్గొన్నారు. దీనితో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details