విశాఖ మన్యంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. హుకుంపేట పోలీస్ స్టేషన్ లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీటితో కలిపి స్టేషన్ లో కేసుల సంఖ్య ఐదుకు చేరింది. స్టేషన్ కు కొన్ని రోజుల పాటు ఎవరు రావద్దని అధికారులు ఆదేశించారు. పాడేరులో మొదట నమోదైన పోస్ట్ మాన్ కొవిడ్ కాంటాక్ట్ లు భయాందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీసీ క్వార్టర్స్లో 3 కరోనా కేసులు నమోదు అవడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
హుకుంపేట పోలీస్ స్టేషన్లో నలుగురికి కరోనా... - విశాఖలో కరోనా కేసులు
కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. విశాఖ మన్యంలోను కేసుల సంఖ్య ఎక్కువ అయింది. హుకుంపేట పోలీస్ స్టేషన్ లో నలుగురికి కరోనా నిర్ధారణ అవడంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు.
Police station
ఏజెన్సీలో ఇప్పటివరకు 24 పాజిటివ్ కేసులు వచ్చాయి. పాడేరు కుమ్మరిపుట్టలో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ను.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. రోగుల నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని .. భోజన వైద్య సదుపాయాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.