ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా కలవరం - విశాఖ కోవిడ్ వార్తలు

విశాఖ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. దస్తావేజులేఖర్లులో ఒకరికి కరోనా లక్షణాలు గుర్తించారు. దీంతో సోమవారం నుంచి కార్యాలయం మూసివేయాలని సిబ్బంది ఆలోచిస్తున్నారు.

చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా కలవరం
చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా కలవరం

By

Published : Jul 25, 2020, 5:58 PM IST

విశాఖ జిల్లా చోడవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరోనా అలజడి నెలకొంది. దస్తావేజులేఖరుల్లో ఒకరికి కొవిడ్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో.. మిగిలిన వారంతా భయాందోళనకు గురయ్యారు. దీంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సోమవారం నుంచి కార్యాలయం మూసివేస్తామని కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

చోడవరం పోలీసు స్టేషన్​లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకినట్లు తెలింది. దీంతో ఆ కానిస్టేబుల్ ప్రైమరీ కాంటాక్టులు మరో ఇద్దరు కానిస్టేబుల్ లకు కొవిడ్ పరీక్షలు చేయించారు. శనివారం నాటికి చోడవరం మండలంలో 37 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది చోడవరం పట్టణవాసులే ఉన్నారు.

ఇదీ చదవండి :శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?

ABOUT THE AUTHOR

...view details