ఆసుపత్రుల్లో మరుగుదొడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆదేశించారు. ఈఎన్టీ, టీబీ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషంట్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఔషధాల గదిని సందర్శించారు. మాటలు రాని పిల్లలకు శస్త్రచికిత్స చేసి సంవత్సరం పాటు ఉచితంగా స్పీచ్ థెరపీ ఇస్తారని.. ఆస్పత్రిలో ఉండేందుకు ఉచితంగానే వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయని వైద్యులు వివరించారు. లైటింగ్, సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని, రోగులకు తగిన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. టీ.బీ. ఆసుపత్రిలో పల్మనాలజీకి సంబంధించి చేసే పరీక్షలపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్న కాంట్రక్ట్ సిబ్బంది క్రమబద్ధీకరించాలని, పొరుగుసేవల సిబ్బందిని ఒప్పంద కార్మికులుగా చేర్చాలని వారు కలెక్టర్ ను కోరారు.
''ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి''
విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఈఎన్టీ, టీబీ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
కలెక్టర్