కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్టు - కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి
కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేసిన ఘటన విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరి శివారు ప్రాంతంలో జరిగింది. ఈ దాడుల్లో 16 మందిని అరెస్టు చేసి పందెం కోళ్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు.
కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడి..16 మంది అరెస్టు !
విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరి శివారు ప్రాంతంలోని కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పందేలు నిర్వహిస్తున్న 16 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రూ.11,500 నగదు, 12 సెల్ఫోన్లు, ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మండలంలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.