విశాఖ జిల్లా హనుమంతవాక సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. శ్రీభరత్, వెలగపూడి రామకృష్ణను గెలిపించాలని కోరారు. జగన్ కేంద్రంతో లాలూచీ పడి మనపై దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో 25 లక్షలు ఓట్లు తీసేస్తే మాట్లాడలేదని విమర్శించారు. దేశాన్ని నాశనం చేసేందుకు మోదీ కంకణం కట్టుకున్నారన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ కలిసిరండి.. చూసుకుందామని సవాలు విసిరారు. ముగ్గురినీ బంగాళాఖాతంలో కలిపేస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మెచ్చే విధంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. తప్పుడు విధానాలు చేస్తే గట్టిగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకు ఓటేస్తే వృథా అవుతుందన్నారు. హనుమంతవాక-మద్దిపాలెం పైవంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు.
మోదీ, కేసీఆర్, జగన్ కలిసిరండి.. చూసుకుందాం: చంద్రబాబు - vsp
విశాఖ జిల్లా హనుమంతవాక సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. శ్రీభరత్, వెలగపూడి రామకృష్ణను గెలిపించాలని కోరారు.
ప్రజలు మెచ్చే విధంగా ఎన్నికలుండాలి : సీఎం