విశాఖలో ఉన్న గ్రీన్‌క్లైమేట్ సంస్థ విద్యార్దులతో ఓ వినూత్న కార్యక్రమానికి తెరదీసింది. వినయక చవితి కి మట్టిగణపయ్యలనే పూజించాలని ప్రచారం చేస్తోంది. విద్యార్దులతో కలసి మట్టి వినాయకుల తయారీలో మెలకవులను ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణానికి ఎలా హాని చేస్తాయని తెలుపుతూ, విద్యార్దుల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మట్టి విగ్రహాల తయారీలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు పర్యావరణాన్ని కాపాడటానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని తెలిపారు. విత్తనాలను మట్టి విగ్రహాల్లో పెట్టి తయారు చేయటం వలన వినాయక నిమజ్జనం తరువాత మంచి మెుక్కను పెంచుకోవచ్చునని తెలిపారు. విద్యార్థులతో పెద్ద ఎత్తున విగ్రాహాలు తయారు చేయించి, ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజలు మట్టిగణపతి విగ్రహాలనే వాడలని గ్రీన్ క్లైమేట్ సంస్థ సూచిస్తోంది.
పర్యావరణ హితం మట్టి గణపయ్య - undefined
మట్టి వినాయకులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించండి..అనే నినాదంతో గ్రీన్ క్లైమేట్ సంస్థ విద్యార్థులతో కలిసి విశాఖలో వినూత్న కార్యాక్రమానికి శ్రీకారం చుట్టింది.
' పర్యావరణానికి మట్టి గణపయ్యే ముద్దు'