విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రాయితీ విత్తనాల పంపిణీలో గందరగోళం తలెత్తింది. విత్తనాలు పొందడానికి మండలంలోని పలు ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. తోపులాట జరిగింది. వరుసలో ఉన్న వారికి కాకుండా పక్కనుంచి వచ్చిన వారికి విత్తనాలు అందించారంటూ రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సక్రమంగా విత్తనాలు అందజేస్తామని పోలీసులు హామీ ఇచ్చాకే ఘర్షణ అదుపులోకి వచ్చింది. అయితే... విత్తనాలు చాలా తక్కువగా వచ్చాయని, అవసరమైనంతగా అందించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
విత్తనాల పంపిణీలో పోలీసులతో వాగ్వాదం - visakhapatnam district
విశాఖ జిల్లా ఎం. ఆలమండ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి విత్తనాలు తక్కువగా రావడంపై రైతుల్లో పెల్లుబికింది. ఈ క్రమంలో వరుసలో ఉన్నవారు కాకుండా పక్కనుంచి వచ్చిన వారికి విత్తనాలు అందించారంటూ... పోలీసలుకు రైతలకు మధ్య వాగ్వాదం జరిగింది.
విత్తనాల పంపిణిలో పోలీసులతో వాగ్వివాదం