క్రిస్మస్ సందర్భంగా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా యువత ఏసుక్రీస్తు నామస్మరణ చేస్తూ, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
పురవీధుల్లో భక్తులు సంకీర్తన:

పాడేరులో భక్తులు ఏసు క్రీస్తుని నామస్మరణ చేస్తూ, పురవీధుల్లో సంకీర్తనలు పాడారు. యేసు మళ్ళీ పుట్టాడంటూ బోధనలు చేశారు. టాటా వ్యాన్లో ఊరేగింపుగా వెళ్లిన యువత... క్రిస్మస్ తాత వేషం వేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
సబ్బుపై జీసస్ ప్రతిమ
విశాఖ జిల్లా, మాడుగుల మండలంలోని ఎం కోడూరు గ్రామానికి చెందిన గోపాల్ తన సూక్ష్మ కళతో సబ్బు పై జీసస్ ప్రతిమను చెక్కి.. ఉనికిని చాటుకున్నాడు. మూడు గంటలపాటు శ్రమించి తీర్చిదిద్దిన ఈ ప్రతిమ చూపరన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అంతకుముందు ముఖ్యమైన దినాలు.. దేశ నాయకుల జయంతి.. అలాగే పండుగల సందర్భంగా గోపాల్ తన కళకు పదునుపెట్టి.. ఎన్నో సూక్ష్మ రూపాలు తయారుచేశాడు.