విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వామి వారికి రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ కార్యక్రంమంలో స్వామికి మూడు మణుగుల నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని అరగదీస్తారు. అనంతర సుగంధ ద్రవ్యాలు కలిపి ఈనెల 18న స్వామివారికి చందన సమర్పణ చేస్తారు. ఆ రోజు పౌర్ణమి కావడం వల్ల భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. దేవస్థానం అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు.
సింహాద్రి అప్పన్నకు రెండో విడత చందన అరగదీత! - appanna swamy
సింహాచల అప్పన్నస్వామికి రెండో విడత చందన అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 18న స్వామి వారికి చందనాన్ని సమర్పించనున్నారు.
రెండో విడత చందన అరగదీత కార్యక్రమం ప్రారంభం