విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ పోతురాజు పుట్టులో వరసకు అన్నాచెల్లెలైన అయిన చందు, శ్రావణి అనే పదేళ్ల చిన్నారులు గ్రామ సమీపంలో గడ్డలోకి స్నానానికి దిగారు. ఇద్దరూ నీటిలో మునిగిపోతుండగా.. అటువైపు పడవపై వచ్చిన స్థానికులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న చిన్నారులను ముంచింగిపుట్టు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో పాడేరు ఆస్పత్రికి తరలించారు. పెదబయలు దాటిన తర్వాత ఇద్దరు చిన్నారులు తుదిశ్వాస విడిచారు. తాము పనులకు వెళ్లామని.. తమ పిల్లలకు పాఠశాలలు లేకపోడవంతో గడ్డకు వెళ్లారని.. కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
మన్యంలో విషాదం..స్నానానికి గడ్డలోకి వెళ్లి అన్నాచెల్లెలు మృతి
విశాఖ పాడేరు ఏజెన్సీలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అన్నాచెల్లెలు స్నానం కోసం గడ్డలోకి దిగి మృతి చెందారు.
మన్యంలో విషాదం.. స్నానానికి గడ్డలోకి వెళ్లి అన్న చెల్లెలు మృతి
TAGGED:
vishaka agency crime news