ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె..? - 108 staff strike

108 సిబ్బంది సమ్మె ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. విశాఖ జిల్లా పాడేరు మన్యంలో సకాలంలో చికిత్స అందక 3నెలల చిన్నారి మృతి చెందింది. 108 సిబ్బంది సరిగా స్పందించకపోవడమే.. చిన్నారి మృతికి కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె

By

Published : Jul 24, 2019, 7:59 PM IST

చిన్నారి ప్రాణం తీసిన 108 సిబ్బంది సమ్మె

రాష్ట్రవ్యాప్తంగా 108 సిబ్బంది చేస్తున్న సమ్మె ఓ పసిపాప ప్రాణాన్ని బలిగొంది. సకాలంలో వైద్యం అందక 3నెలల చిన్నారి కన్నుమూసింది. విశాఖ జిల్లా పాడేరు మండలం డల్లాపల్లి సమీపంలోని బూరుగుచెట్టు గ్రామానికి చెందిన 3నెలల చిన్నారి అనూషకు కడుపులో నొప్పివచ్చింది. గ్రామస్తులు ఆశా కార్యకర్తలకు సమాచారం ఇవ్వగా... వారు 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 వాహనాలు ఖాళీ లేవని బదులిచ్చారు. తాము సమ్మెలో ఉన్నామని బాధితులకు చెప్పలేదు.

పలుమార్లు 108 వాహనం కోసం ఫోన్ చేసినా... ఖాళీ లేదనే చెప్పారు. వాహనం వచ్చాక తమ గ్రామానికి వస్తారని అంతా అనుకున్నారు. రాత్రి వరకు ఎదురుచూశారు. పరిస్థితి విషమించి రాత్రి 10 గంటల సమయంలో చిన్నారి అనూష మృతి చెందింది. ఉదయం నుంచి 108 వాహనం కోసం ఎదురు చూశామని... చిన్నారి తండ్రి లింగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 108 సిబ్బంది వ్యవహారశైలిపై చిన్నారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మెలో ఉన్న విషయం ముందే చెబితే... తాము ఇతర వాహనం ఏర్పాటు చేసుకునేవాళ్లమని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details