ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలు వస్తే సీఎం విదేశాల్లో... మనం జనంలో..!

విశాఖలో తెదేపా నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి అంతా కలిసికట్టుగా శ్రమించాలని... ఓటమితో కుంగిపోవద్దని దిశానిర్దేశం చేశారు.

By

Published : Oct 10, 2019, 12:49 PM IST

Updated : Oct 10, 2019, 7:15 PM IST

విశాఖలో తెదేపా నాయకులతో చంద్రబాబు భేటీ

'వరదలు వస్తే సీఎం విదేశాల్లో ఉన్నారు... మనం జనంలో ఉన్నాం...'

ఓటమి కారణంగా కుంగిపోవద్దని పార్టీ కార్యకర్తలకు తెదేపా అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. విశాఖలో తెదేపా నాయకులతో సమావేశమైన ఆయన... పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని... శాంతిభద్రతలు కాపాడడంపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహించారు. ప్రస్తుతం ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. హుద్‌హుద్‌, తిత్లీ సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని... జనం మధ్యే ఉన్నామని గుర్తు చేసిన చంద్రబాబు... గోదావరి, కృష్ణా వరదలు వస్తే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనల్లో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రికి ఏ మాత్రం చలనం, ఆలోచన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. గోదావరి బోటు ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా వెలికితీయలేని అసమర్థత ప్రభుత్వంలో నెలకొందని అన్నారు. ముఖ్యమంత్రి కేవలం ఏరియల్​ సర్వే చేసి ఊరుకున్నారని.. ఇంత అసమర్థ పాలనను తాను ఎక్కడా చూడలేదని అన్నారు.

Last Updated : Oct 10, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details