విశాఖలో కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ద నార్తర్న్ సర్కార్స్ (సీబీసీఎన్సీ) ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తుల పరిరక్షణ ముసుగులో సంబంధం లేని వ్యక్తులు, బాప్టిస్టు సంఘాలకు నాయకులమని తెరపైకి రావడాన్ని సీబీసీఎన్సీ క్రైస్తవ సంఘాలు ఖండించాయి. జాన్, డానియల్ గాంధీ, జొసెఫ్ ప్రకాష్ అనే ముగ్గురు వ్యక్తులు పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తూ హిల్ క్రైస్ట్ బంగ్లా నిర్వాహకులను బెదిరించడంపై వీరు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురు వ్యక్తులు చేస్తున్న అరాచకాల చిట్టాతో ఒక కరపత్రాన్ని విడుదల చేసిన సంఘాల సభ్యులు.. ఇకపై వీరి ఆటలను సాగనీయమని హెచ్చరించారు.
ఆస్తుల పరిరక్షణ పేరుతో తెరపైకి సంబంధం లేని వ్యక్తులు..క్రైస్తవ సంఘాల ఆగ్రహం - vishakapatnam latest news
విశాఖలో సీబీసీఎన్సీ ఆస్తుల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆస్తుల పరిరక్షణ ముసుగులో సంబంధం లేని వ్యక్తులు, బాప్టిస్టు సంఘాలకు నాయకులమని తెరపైకి రావడాన్ని సీబీసీఎన్సీ క్రైస్తవ సంఘాలు ఖండించాయి.
విశాఖలో సీబీసీఎన్సీ ఆస్తుల వివాదం
వీరికి మద్దతుగా యాకోబు, రత్నకుమార్ అనే వ్యక్తులు కూడా పలు అక్రమాలకు పాల్పడ్డారని క్రైస్తవ సంఘాలు తెలిపాయి. సీబీసీఎన్సీ పేరిట నిరుద్యోగ టీచర్ల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్నారు. వీరికి తగిన బుద్ది చెప్పే విధంగా క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: