విశాఖ జిల్లా గొలుగొండ మండలం గుమ్మాల వద్ద ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా గంజాయి పట్టుబడింది. పాకలపాడు నుంచి గుమ్మాల వైపు వస్తున్న కారులో లోడ్ చేసిన 132 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. రాజమండ్రి ప్రాంతానికి చెందిన కొవ్వూరు రమేశ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చింతపల్లి మండలం అన్నవరం నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్సై నారాయణరావు తెలిపారు.
విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత - విశాఖలో గంజాయి పట్టివేత న్యూస్
గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 132 కిలోల గంజాయిని విశాఖ జిల్లా గొలుగొండ పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
Cannabis caught in vishaka