ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా బోడో జాతర ప్రారంభం... తరలివచ్చిన భక్తజనం - ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఘనంగా బోడో జాతర

ప్రతి రెండేళ్లకొకసారి జరిగే బోడో జాతర.. ఆంధ్రాఒడిశా సరిహద్దులోని మల్కాన్​గిరి జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... ఈ వేడుక నిర్వహిస్తున్నారు.

Bodo jathaBodo jathara started in malkangiri district ra
బోడో జాతర

By

Published : Mar 23, 2021, 6:51 PM IST

ఘనంగా బోడో జాతర ప్రారంభం

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో గల మల్కాన్‌గిరి జిల్లాలో జరిగే ప్రసిద్ద బోడో జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రతి రెండేళ్లకొకసారి జరిగే ఈ జాతరకు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు. ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా కట్టుదిట్టమైన నిబంధనలతో జాతర చేపట్టడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

మంగళవారం మొదటగా తూర్పుగోదావరి జిల్లా పొల్లురు నది ఘాట్‌ వద్ద బాలరాజు, కన్నంరాజు, పోతురాజు విగ్రహ మూర్తులకు పూజలు నిర్వహించారు. ప్రత్యేక పడవ మీద నదిని దాటించి మన్నెం కొండ వద్దకు తీసుకొస్తారు. ఈ వేడుక నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details