పడవ ప్రమాదం: విశాఖ వాసుల వివరాలు - vishakha
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన విషాద ఘటనలో విశాఖ జిల్లాకు చెందిన వారు గల్లంతయ్యారు. తమ వారి ఆచూకి తెలియకపోవటంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
పడవ ప్రమాదం: విశాఖ జిల్లా నుంచి వెళ్లిన పర్యటకులు వివరాలు
తూర్పు గోదావరి జిల్లాలో బోటు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు బాధితులయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వారి విరాలు ఇలా ఉన్నాయి.
- విశాఖపట్నానికి చెందిన ఒకే కుటుంబవాసులు ప్రమాదం బారిన పడ్డారు. వారిని... మధుపాడ రమణ బాబు, మదుపాడ అరుణ కుమారి, మధుపాడ ఆకెలేష్, మదుపాడ కుశాలి, మధుపాడ పుష్పగా గుర్తించారు. వీరు కింగ్ జార్జి ఆసుపత్రి ఎదురుగా ఉన్న రామ లక్ష్మీ కాలనీ కి చెందిన వారని తెలిసింది.
- అరిలోవ ప్రాంతానికి చెందిన తలారి అప్పల నరసమ్మ , ఇద్దరు పిల్లలు ప్రమాదం బారిన పడ్డారు.
- వేపగుంటకు చెందిన బోశాల లక్ష్మి.. ప్రమాదంలో చిక్కుకోగా కుటుంబసభ్యులు ఈటీవీలో చూసి గుర్తించారు. ఆమె వివరాలు ఇప్పటికీ తెలియరాలేదని ఆందోళన చెందుతున్నారు.