ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసులన్నాయని భాజపాలో చేరితే... భంగపాటే: మురళీధరరావు - భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

100 రోజుల వైకాపా పాలనలో రాష్ట్రం పురోగతి సాధించిందేమీ లేదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. విశాఖలో పర్యటించిన ఆయన... భాజపాకు ఏపీ కీలక రాష్ట్రమని చెప్పారు.

కేసులన్నాయని భాజపా చేరితే... భంగపాటే : మురళీధరరావు

By

Published : Sep 9, 2019, 10:17 PM IST

కేసులన్నాయని భాజపా చేరితే... భంగపాటే : మురళీధరరావు

వైకాపా ప్రభుత్వంతో గుణాత్మక మార్పులు వస్తాయని భావించినా... 100 రోజుల పాలన చూస్తే ఏ పురోగతి సాధించిన దాఖలాలు లేవని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో జన జాగరణ అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మురళీధరరావు పాల్గొన్నారు. ప్రజాసమస్యలపై పోరాడడానికి రాష్ట్రంలో భాజపా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఈడీ, ఐటీ, ప్రభుత్వ శాఖలు చేసే సోదాలు, విచారణలకు భాజపాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. భాజపాలోకి వస్తే కేసులు నుంచి రక్షణ ఉంటుందని భ్రమపడేవారికి భంగపాటు ఖాయమని మురళీధరరావు హెచ్చరించారు. కేసులున్న వారు భాజపాలో చేరినంత మాత్రాన కమలదళ డీఎన్​ఏ మారదని స్పష్టం చేశారు. భాజపాలో ఉన్న వారిపైనా సోదాలు, విచారణలు జరిగాయని గుర్తు చేశారు.

ఒకే దేశం..ఒకే చట్టం..ఒకే జెండా

సెప్టెంబర్ 1 నుంచి జాతీయ ఏక​త అభ్యాన్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న మురళీధర్ రావు... దేశంలో 400 ప్రాంతాల్లో మేధావులతో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భాజపా వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయం.. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే జెండా సాకారం చేయడానికే 370 అధికరణను రద్దు చేసినట్టు తెలియజేశారు. ఈ అధికరణ వల్ల కశ్మీర్​లో మహిళలకు, గిరిజనులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపించారు. ఆ అన్యాయాన్ని భాజపా సరిచేసిందన్నారు.

ఇదీ చదవండి:

ఏపీలో భాజపానే ప్రత్యామ్నాయం:పీవీ మాధవ్

ABOUT THE AUTHOR

...view details