GVL Narasimha rao: కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం విజయం సాధించడం ఖాయమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. దేశంలో భాజపా తప్ప మరో పార్టీ లేదన్నారు. గత ఎన్నికల్లో భాజపాకు 300 పార్లమెంట్ సీట్లు వచ్చాయి.. ఈ సారి 400 సీట్లు సాధించాలనే ప్రణాళికతో పని చేస్తామని తెలిపారు. భాజపా కోల్పోయిన 174 సీట్లపై దృష్టి పెట్టిందని తెలిపారు. అందులో భాగంగానే విశాఖపై దృష్టి పెట్టామన్నారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో 5 వేల సదస్సులు నిర్వహించే ప్రణాళికతో ఉన్నామని తెలిపారు. కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాము. హైదరాబాద్, భీమవరానికి ప్రధాని మోదీ వచ్చారు. రాష్ట్రంలో జనసేనతో భాజపా ప్రజల్లోకి వెళ్తోందని చెప్పారు. జనసేన, భాజపాల మధ్య సయోధ్య ఉందని.. 175 నియోజకవర్గాల్లో మా బలం పెంచుకుంటామని తెలిపారు. రాహుల్ గాంధీ ఎన్ని యాత్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం లేదని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యమ్నాయం కోరుతున్నారని.. అమరావతి రాష్ట్ర రాజధానిగా.. నిర్ణయం భాజపా చేసిందని చెప్పారు. రాజకీయంగా భాజపా నిర్ణయానికి వైకాపా వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు పోరాడతామని అన్నారు.
దేశంలో భాజపా తప్ప మరో పార్టీ లేదు: ఎంపీ జీవీఎల్
GVL Narasimha Rao: కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం రావడం ఖాయమని.. ఈ సారీ 300 సీట్లు గెలిచిన భాజపా రాబోయే ఎన్నికల్లో 400 సీట్ల కోసం ప్రణాళికతో పని చేస్తున్నామని జీవీఎల్ నరసింహరావు అన్నారు. రాష్ట్రంలో 175 నియెజకవర్గాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.
విశాఖలో యాదవులు, తూర్పు కాపులకు స్థలాలు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్టు వివరించారు. విశాఖ నగరంలో కాలుష్యంపై దృష్టి పెట్టామని, విశాఖ అభివృద్ధి మీద భాజపా కట్టుబడి ఉంటుందని అన్నారు. విశాఖ భూ ఆక్రమణలపై తెదేపా, వైకాపాలు రెండు సిట్లు వేశాయని.. ఆ రిపోర్ట్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తమ పార్టీ వాళ్లు ఉన్నందుకే ఆ పార్టీలు నివేదిక బయటపెట్టడం లేదని ఆరోపించారు. మధ్య తరగతి వాళ్ళపై ప్రతాపం చూపే ప్రభుత్వం.. భూ కబ్జాదారులు మీద చర్య తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెదేపా, వైకాపాలు కుమ్మక్కు అయినట్టు కనిపిస్తోందని ఆరోపించారు.
ఇవీ చదవండి: