BJP Leaders Fired on YCP Leaders: విశాఖలో వైకాపా నేతలు ప్రభుత్వ భూములు ఆక్రమించి విల్లాలు కడుతున్నారని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక వర్గం వారే భూ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. దసపల్లా భూములు అక్రమించారు.. 22 ఏలో ఉన్న భూములు లాక్కుని అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని అన్నారు. భూ కుంభకోణంపై సీబీఐ ఈడీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వివాదాల్లో ఉన్న భూములు ఎవరూ కొనొద్దని,.. కొంటే తరువాత ఇబ్బంది పడతారని అన్నారు. ప్రధాని పర్యటనలో వైకాపా నేతలు హడావిడి చేస్తున్నారని.. వాళ్ల ఆటలు సాగవన్నారు.
"రీ సర్వే ద్వారా రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయో.. వాటి లెక్కలు తీయడం... అవసరమైన వాటిని 22ఏ లో చేర్చడం.. ఆ వివాదాల్లో ఆ పార్టీ నాయకులే జోక్యం చేసుకోవడం.. ఒక సొంత డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసుకుని వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకుని లక్షల ఏకరాల భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భూమినంతా రాబందుల్లా దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు." సత్యకుమార్, భాజపా జాతీయ కార్యదర్శి