భారతీయ జనతా పార్టీ సంస్థాగత శిక్షణ తరగతులను విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హాజరయ్యారు.
కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన...పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతికి అవసరమైన సిద్ధాంతాలను భాజపా పాటిస్తోందన్నారు.