ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2021, 5:10 PM IST

ETV Bharat / state

విశాఖ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి బయోమెట్రిక్‌ వ్యవస్థ

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బయోమెట్రిక్‌ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.విశాఖ రైల్వేస్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల తోపులాటలను నియంత్రించడానికి.. వాల్తేర్‌ ఆర్పీఎఫ్‌ అధికారులు వినూత్న ఆలోచన చేశారు.

Biometric system is yet to start at Visakhapatnam Railway Station
విశాఖ రైల్వేస్టేషన్‌లో అందుబాటులోకి బయోమెట్రిక్‌ వ్యవస్థ

విశాఖ రైల్వేస్టేషన్‌లో సాధారణ ప్రయాణికుల తోపులాటలను నియంత్రించడానికి.. వాల్తేర్‌ ఆర్పీఎఫ్‌ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లకు బయోమెట్రిక్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ ప్రయాణికుడు టికెట్‌ తీసుకున్న తర్వాత ఆ వ్యవస్థ వద్దకు వెళ్లి వేలిముద్ర వేస్తే.. ఒక నంబరుతో టోకెన్‌ వస్తుంది. దీని ఆధారంగా రైలులో సీటు పొందేలా ఆర్పీఎఫ్‌ పోలీసులు ఏర్పాట్లు చేశారు.

అందుబాటులోకి రానున్న డ్రోన్‌, బయోమెట్రిక్‌ వ్యవస్థలు ఇలా...

సీరియల్ నెంబరు ఆధారంగా..

వాల్తేర్‌ సీనియర్‌ డివిజనల్‌ సెక్యూరిటీ కమిషనర్‌ జితేంద్రకుమార్‌ శ్రీవాస్తవ శనివారం ఈ వ్యవస్థను రైల్వేస్టేషన్‌లో ప్రారంభించారు. టోకెన్‌ పొందిన ప్రయాణికుని సీరియల్‌ నంబరు ఆధారంగా అతని కంటే ముందు ఎంత మంది వచ్చారో తెలుస్తుందన్నారు. ప్రయాణికుని చిత్రంతో పాటు పూర్తి వివరాలు యంత్రంలో నమోదవుతాయని తెలిపారు. ఏడాది పాటు ఈ వివరాలు నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ విధానం వల్ల సాధారణ ప్రయాణికుల వివరాలు నమోదు చేయడంతోపాటు రద్దీ రైళ్లలో అనధికారికంగా సీట్లు అమ్మకాలను కట్టడి చేయవచ్చన్నారు. మొదటిగా ఈ వ్యవస్థను గోదావరి, రత్నాచల్‌, జన్మభూమి, సింహాద్రి, తిరుమల, కోర్బా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అందుబాటులోకి తీసుకురాన్నుట్లు వెల్లడించారు. నిఘా వ్యవస్థను మెరుగుపరచడానికి మానవ రహిత డ్రోన్‌ కెమెరాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

మల వ్యర్థాల శుద్ధీకరణ దిశగా ముందడుగు

ABOUT THE AUTHOR

...view details