విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ పారిశ్రామిక అవసరాలకు స్థలం సేకరించటానికి ఈనెల 25న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందుకు నిరసనగా తెదేపా, సీపీఐ, సీపీఎం పార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. భూనిర్వాసితులకు ముందస్తు పరిహారం చెల్లించాకే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకుడు వెంకటేష్, సీపీఎం నాయకుడు అప్పలరాజు, దాసు పాల్గొన్నారు.
'భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాకే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి'
ఏపీఐఐసీ పారిశ్రామిక అవసరాల కోసం భూసేకరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనగా పలు పార్టీలు ర్యాలీ నిర్వహించాయి. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
తెదేపా, సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ