వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలిలోని వైకాపా కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద బజారులో ఉన్న వైయస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోదరుడు ముత్తం శెట్టి మహేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
భీమిలిలో వైకాపా శ్రేణుల సంబరాలు - visakha
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా విశాఖ జిల్లా భీమిలిలో వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
భీమిలి