విశాఖలో పశ్చిమ బెంగాల్ కు చెందిన 28 మంది పర్యాటకులు అస్వస్థతకు గురయ్యారు. నగర పర్యటనకు వచ్చిన వీరు ఫుడ్ పాయిజన్ కావడంతో అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. టీబీ ఆసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అస్వస్థతకు గురైన 28 మంది పర్యటకులు - in
విశాఖలో మాంసాహారం తిని బంగాల్ కు చెందిన పర్యటకులు అస్వస్థతకు గురయ్యారు. వారు వండుకుని తిన్న ఆహారమే కలుషితం అయింది.
అస్వస్థతకు గురైన పర్యటకులు
సుమారు 80 మంది పర్యాటకులు బుధవారం విశాఖకు వచ్చారు. ఓ ప్రైవేటు లాడ్జిలో బస చేసి వారు సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకున్నారు. చేపలు, కోడికూర వంటివి తయారు వండుకుని తిన్నారు. ఆహారం కలుషితం కావడంతో రాత్రి అస్వస్థతకు గురయ్యారు.
Last Updated : Feb 14, 2019, 3:00 PM IST