బడికి దూరమైన పిల్లలను చదువుకు దగ్గర చేస్తూ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌కి రమ్యశ్రీ హృదయాలయ ఫౌండేషన్ నిర్వాహకురాలు, సినీ నటి రమ్యశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా లాసన్స్‌బే కాలనీలోని శాంతి ఆశ్రమం పాఠశాలలో కేకు కట్ చేసి విద్యార్ధులకు బిస్కెట్లు పంపిణీ చేశారు. తమకు ఏడాదికి 15వేల రూపాయలు ఇస్తున్నందుకు పాఠశాల విద్యార్ధులు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు రమ్యశ్రీ తెలిపారు.
రమ్యశ్రీ హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడిబాట - school childrens
పాఠశాల పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయల నజరానా ప్రకటించిన సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశాఖలో రమ్య శ్రీ హృదయాలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
బడిబాట