కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం ఇస్తున్న 1000 రూపాయలను వైకాపా నాయకులు రాజకీయానికి వాడుకోవడం సరికాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు హితవు పలికారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరికాదన్నారు. కుటుంబాలను వదిలి 24 గంటలు కష్టపడుతున్న వారికి అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణలో ముఖ్యమంత్రి అవగాహన లోపం వల్ల అపహాస్యం పాలవుతున్నారని చెప్పారు.
పేదలకందించే సాయంతోనూ రాజకీయాలా?: అయ్యన్న - వైసీపీపై అయ్యన్న పాత్రుడు కామెంట్స్
కరోనా మహమ్మారిపై పోరులో కేంద్రం పేదలకు అందిస్తున్న రూ.1000 సాయాన్ని వైకాపా రాజకీయాలకు వాడుకుంటోందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. కరోనా ప్రబలుతున్నా సేవలందిస్తున్న ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టడం సరికాదన్నారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు