విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.స్థానిక తెదేపా నేతలతో కలసి రెండు కాళ్లు విరగ్గొట్టుకున్న యువకుడు సంతోష్ ను కేజీహెచ్ లో ఆయన పరారమర్శించారు.పోలీసు వాహనంపై రాయి విసిరాడనే చిన్న తప్పు కారణంగా,ఏఎస్పీ తుపాకీ ని కణతకు పెట్టి బెదిరిస్తుంటే,సిఐ సమక్షంలోనే ఎస్ ఐ,కానిస్టేబుళ్లు బాధితుడ్ని చితక బాదారని అయ్యన్న మండిపడ్డారు.కొందరి ప్రవర్తనతో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థకే మచ్చవచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని,లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని తెదేపా నేతలు హెచ్చరించారు.
పోలీసు ప్రతిష్ట దెబ్బతీసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు:అయ్యన్న - comments
దేశంలో ఏపీ పోలీసు ప్రతిష్టను దెబ్బతేసేలా, కొందరు ప్రవర్తిస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన సంతోష్ ను ఆయన కేజీహెచ్ లో పరామర్శించారు.
అయ్యన్నపాత్రుడు