కరోనా నియంత్రణ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తక్కువ సమయంలోనే.. కరోనా బాధితులు లక్షకు పైగా దాటిపోయారని.. ప్రభుత్వం వైఫల్యమే కారణమన్నారు. కొవిడ్ పరీక్షల విషయంలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయన్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో సరైన భోజన వసతి లేదని అయ్యన్న ఆరోపించారు.
'కరోనా నియంత్రణ విషయాన్ని జగన్ తేలిగ్గా తీసుకున్నారు' - కరోనాపై అయ్యన్నపాత్రుడు కామెంట్స్
తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైకాపా పాలన పై మండిపడ్డారు. విపత్కర సమయాల్లోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ayyanna fires on jagan about corona tests