ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ తీరు మారకుంటే.. పోరాటానికి దిగుతాం: అయ్యన

సీఎం జగన్ మోహన్ రెడ్డికి పరిపాలనపై సరైన అవగాహన లేకే... ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన పాత్రుడు వ్యాఖ్యానించారు. రుణమాఫీ జీవో రద్దుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

By

Published : Sep 26, 2019, 11:00 PM IST

రైతులకు మేలు చేసే పథకాలు రద్దు చేయడం సరికాదు : అయ్యన పాత్రుడు

రైతులకు మేలు చేసే పథకాలు రద్దు చేయడం సరికాదు : అయ్యన పాత్రుడు

వైకాపా ప్రభుత్వం రైతు రుణమాఫీ జీవోను రద్దు చేయడం దురదుష్ట్రకరమని మాజీమంత్రి అయ్యన పాత్రుడు అన్నారు. రైతులకు మేలుచేసే రుణమాఫీ పథకాన్ని కొనసాగించాలన్నారు. విశాఖలో మాట్లాడిన ఆయన వ్యవసాయ శాఖ మంత్రికి వ్యవసాయంపై అవగాహన లేదన్నారు. రుణమాఫీ రద్దుకు పొంతనలేని కారణాలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు హాయంలోనే రుణమాఫీ నిధులు విడుదల చేయగా, ఎన్నికల కోడ్ వలన అవి ఆగిపోయాయని తెలిపారు. రైతులకు అన్యాయం చేయవద్దన్న ఆయన... విశాఖలో భూకబ్జాలుపై విచారణ చేయాలని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కోరామన్నారు. తెదేపా హయంలో వేసిన సిట్ నివేదికను వైకాపా ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వతీరు మారకపోతే రైతుల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details