ఇదీ చదవండి
'చంద్రబాబు సూచనతోనే భాజపా- జనసేన పొత్తు' - avanthi on janaseena
ప్రజల విశ్వాసాన్ని పవన్ కల్యాణ్ కోల్పోయారని మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. ఏ పార్టీతోనైనా ఆరు నెలలు మించి ఉండలేరని విమర్శించారు. భాజపా-జనసేన పొత్తు అవకాశవాద రాజకీయమని ఆరోపించారు. విశాఖ జిల్లా భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ... పవన్ ఏమి సాధించారని భాజపాలో చేరారని ప్రశ్నించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి నిధులు ఏవీ సాధించలేదని విమర్శించారు. చంద్రబాబు సూచనతోనే భాజపాతో, జనసేన పొత్తు అని ఆరోపించారు. చంద్రబాబు కావాలనే తన అనుచరులను భాజపాలోకి పంపుతున్నారని మంత్రి విమర్శించారు.
పవన్ కల్యాణ్‌పై అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు
TAGGED:
avanthi on janaseena