రాజధాని రైతులపై కేసులు, 144 సెక్షన్ అమలు, పోలీసుల కవాతుపై... ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. నిషేధాజ్ఞలపై రాజధాని మహిళలు, రైతులు దాఖలు చేసిన 7 పిటిషన్లపై ఇవాళ విచారణ నిర్వహించిన న్యాయస్థానం... 144 సెక్షన్ అమలుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 610 మంది రైతులపై కేసులు పెట్టడంపై అడ్వకేట్ జనరల్‌ను న్యాయమూర్తులు వివరణ అడిగారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. మహిళను పోలీసులు బూటు కాలితో తన్నడం సహా.. నోరు నొక్కడం, మగ పోలీసులు ఆడవారిని అరెస్టు చేయడంపై ప్రశ్నలు సంధించారు. అనంతరం... ప్రభుత్వం తరపున గంటపాటు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్... శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. బెంజి సర్కిల్ వద్ద ర్యాలీ చేసేందుకు రైతులు వెళ్తున్నందునే అరెస్టు చేశామన్నారు. సమగ్రంగా ప్రమాణపత్రం దాఖలుకు సమయం కోరగా... విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
అమరావతిలో 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం - 144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహం వార్తలు
రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీసు యాక్టు 30 అమలుపై హైకోర్టులో విచారణ ముగిసింది. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్ ఉందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. 144 సెక్షన్‌ను రాజధానిలో పొడిగించామని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వివరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దృష్ట్యా రైతులను అడ్డుకున్నట్లు వివరించారు. ముందస్తు సమాచారం అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వ అడ్వకేట్ సమయం కోరారు. 144 సెక్షన్ అమలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.