విశాఖ జిల్లా భీమునిపట్నం సమీపంలో... పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రతిష్ట మెమెగోన్... బోల్తాపడిన ఆటోను చూసి ఆగారు. గాయపడిన విద్యార్థులను తన అధికారిక వాహనంలో భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. జేసీని స్థానికులు ప్రశంసించారు.
ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు... ఆస్పత్రికి తరలించిన జేసీ - bheemunipatnam lo auto accident, aruguriki gayalu
విశాఖ జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రతిష్ట మెమెగోన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తన అధికారిక వాహనంలో ఆస్పత్రికి తరలించి... ప్రజల ప్రశంసలు పొందారు.
గాయపడిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్న వైద్యులు