ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VSP STEEL PLANT: విశాఖ ఉక్కు పరిశ్రమ సీఎండీగా అతుల్ భట్ నియామకం - విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీగా అతుల్ భట్​ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

అతుల్ భట్
అతుల్ భట్

By

Published : Sep 2, 2021, 5:25 PM IST

Updated : Sep 2, 2021, 7:11 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారం సీఎండీగా అతుల్ భట్​ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మెకాన్ సంస్ధకు సీఎండీగా వ్యవహరిస్తున్న అతుల్ భట్​ను ఈ పదవికి గతనెలలోనే పబ్లిక్ సెక్టార్స్ ఎంపిక కమిటీ ఖరారు చేసింది. అపాయింట్‌మెంట్‌ కమిటీ ఆఫ్ కేబినెట్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2024 నవంబర్ 30వరకు అతుల్ భట్ ఈ పదవిలో ఉంటారని వివరించింది. ప్రస్తుతం సీఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న డైరెక్టర్ దేబ్ కళ్యాణ్ మహంతి నుంచి అతుల్ భట్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

అతుల్‌ భట్‌ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్ 2025 రూపకల్పన చేసి పలు కంపెనీల టేకోవర్, మెర్జింగ్​లో కీలక పాత్ర పోషించారు. తర్వాత 2016 అక్టోబర్​లో ఆయన ప్రభుత్వ రంగ సంస్ధ మెకాన్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్​లో వంద శాతం ప్రభుత్వ వాటాల అమ్మకానికి కేంద్రం నిర్ణయించిన తరుణంలో ఈయన నియామకం ఈ కార్యచరణను వేగవంతం చేసే అవకాశం ఉందని పరిశీలకుల అంచనా వేస్తున్నారు.

అతుల్ భట్ డిగ్రీ పూర్తి చేసిన తొలినాళ్లలో టాటా స్టీల్ లో ఎగ్జిక్యూటివ్​గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి ఆ సంస్ధల్లో కొన్నేళ్లు పని చేశారు. మిట్టల్ కంపెనీలో యూకెలో జిఎంగా, ఇరాన్ తదితర దేశాల్లోనూ పనిచేసి పలు కంపెనీల మెర్జింగ్ వ్యవహారంలో కీలకమైన అనుభవాన్ని సంపాదించారు.

ఇదీ చదవండి:STEEL PLANT: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి'

Last Updated : Sep 2, 2021, 7:11 PM IST

ABOUT THE AUTHOR

...view details