విశాఖలో దారుణం.. యువతిపై హత్యాయత్నం
రోజూ వస్తున్నట్లే విధులు ముగించుకొని వస్తున్న ఆమెపై దుండగులు హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన విశాఖలో శివాజీనగర్‌లో చోటు చేసుకుంది.
విశాఖ నగరంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న దివ్య ఎప్పటిలానే విధులు ముగించుకొని అర్ధరాత్రి ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపంలోకి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలతో రోడ్డుపై కేకలు వేస్తూ ఆమె పరిగెత్తడంతో స్థానికులు గమనించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం 108కు ఫోన్ చేసి కేజీహెచ్‌కు తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన దివ్య పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఎవరనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.