ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ ఉక్కుకు నీలాంచల్​ స్టీల్​ను జత చేస్తారా..? - vizag steel

విశాఖ ఉక్కు పరిశ్రమను.. ఒడిశాలోని నీలాంచల్‌ ఉక్కు కర్మాగారాన్ని ఒక్కటి చేసే అంశం ఇప్పుడు తెరపైకి వస్తోంది. ఎన్‌ఐఎన్‌ఎల్​కు 110 మిలియన్ టన్నులు గనులుండగా కొన్ని సమస్యల వల్ల పరిశ్రమను మాసేశారు. విశాఖ స్టీల్​కు గనుల తీవ్రతతో ప్రభుత్వం ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతోంది. ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశం కావడంతో..కార్మికులు గనులు కేటాయించాలని ఉద్యమాలు చేస్తున్నారు.

Vishakha Steel
విశాఖ ఉక్కు

By

Published : Feb 20, 2021, 7:57 AM IST

ఒడిశాలోని నీలాంచల్‌ ఉక్కు కర్మాగారాన్ని(ఎన్‌ఐఎన్‌ఎల్‌) విశాఖ ఉక్కు కర్మాగారంతో విలీనం చేయాలన్న ప్రతిపాదన మళ్లీ తాజాగా తెరపైకి వచ్చింది. ఈ విషయం ఉక్కుకర్మాగార వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎన్‌ఐఎన్‌ఎల్‌కు సుమారు 110 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజమున్న గనులున్నాయి. 1.1 మిలియన్‌ టన్నుల సామర్థ్యం ఉన్న ఆ కర్మాగారం అంతర్గత సమస్యల కారణంగా ఉత్పత్తిని నిలిపివేసింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో కొనసాగుతున్న ఆ సంస్థను విశాఖ ఉక్కులో విలీనం చేయాలన్న ప్రతిపాదన సుమారు పదేళ్ల కిందటే చర్చకు వచ్చినా ముందుకు సాగలేదు.

గనుల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం ‘నీలాంచల్‌’తో జట్టుకడితే కొంత ఉపశమనం ఉండే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎన్‌ఐఎన్‌ఎల్‌ సంస్థ ప్రతినిధులు కూడా తమ సంస్థను విశాఖ ఉక్కులో కలపాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆ సంస్థకు భారీగా అప్పులున్నాయి ఉత్పత్తి నిలిచిపోయిన ఆ సంస్థను పునరుద్ధరించడం విశాఖ ఉక్కుకు పెనుభారంగా మారే ముప్పు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ సంస్థకు ఉన్న ఇనుప ఖనిజం విశాఖ ఉక్కు అవసరాలను సుమారు ఎనిమిదేళ్లు మాత్రమే తీర్చగలదు. ఆ తరువాత మళ్లీ కథ మొదటికొస్తుందన్నది గమనార్హం.

26న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ శుక్రవారం తీర్మానించింది. 26న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయనున్నారు.

ఇదీ చూడండి:

ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్ధృతంగా సాగుతున్న ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details