ARMY SELECTIONS:సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ’ని నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలు, యానాంకు చెందినవారు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(పది పాసైనవారు), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(8 పాసైనవారు)ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. జులై 30 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. www.joinindianarmy.nic.in అంతర్జాల చిరునామా నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎంపికకు ఏ తేదీన రావాలనే విషయం అడ్మిట్‌కార్డులో ఉంటుందన్నారు. నియామకాలకు సంబంధించిన సందేహాల నివృత్తికి మొబైల్‌యాప్ 'army calling' ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అందులో అభ్యర్థులకు ‘లైవ్ చాట్’ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. విశాఖలోని రిక్రూట్‌మెంట్ కార్యాలయం నంబర్లు 0891- 2756959, 2754680లకు ఫోన్ చేసి కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు.
ARMY SELECTIONS: విశాఖలో అగ్నివీరుల ఎంపిక.. ఎప్పటినుంచంటే? - విశాఖ జిల్లా తాజా వార్తలు
ARMY SELECTIONS: సైన్యంలో అగ్నివీరులుగా విధులు నిర్వర్తించాలనుకునే వారికోసం ఆగస్టు 14 నుంచి 31 వరకు విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ‘ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ’ని నిర్వహించనున్నట్లు తూర్పు నౌకాదళం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(పది పాసైనవారు), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్(8 పాసైనవారు)ని ఎంపిక చేస్తామని వెల్లడించారు. జులై 30 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి ఆగస్టు 7 నుంచి అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు.
ARMY SELECTIONS