విశాఖ జిల్లా అరకులోయలో లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల సేవలను కొనియాడుతూ ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ పోలీసులకు పాదాభివందనం చేశారు. కరోనా వైరస్ను కట్టడి చేయటంలో పోలీసులు చేస్తున్న సేవలు.. వేల కట్టలేనివని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఏఎస్సై మోహన్ కాళ్లకి నమస్కారం చేశారు. ఎమ్మెల్యే చర్యని అందరూ అభినందించారు. ప్రజలు స్వీయ నిర్బంధం పాటించి కరోనా వైరస్ నివారించే చర్యలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఏఎస్సై కాళ్లు మెుక్కిన.. అరకు ఎమ్మెల్యే
కరోనా మహమ్మారి నేపథ్యంలో పోలీసుల సేవలు చెప్పలేనివి. లాక్డౌన్ సరిగా అమలు చేయడంలో వారి కృషే ఎక్కువ. ఆ సేవలను గుర్తించిన అరకు ఎమ్మెల్యే.. ఏఎస్సై కాళ్లకు దండం పెట్టారు.
ఏఎస్సై కాళ్లు మెుక్కిన.. అరకు ఎమ్మెల్యే