రాష్ట్రానికి హోదా ఇవ్వాలని జన జాగరణ సమితి డిమాండ్ - special status
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని జనజాగరణ సమితి డిమాండ్ చేసింది. జీవీఎంసీ గాంధీ పార్క్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రత్యేక హోదా హామీని భాజపా తుంగలో తొక్కిందని ఆరోపించారు.
ap-special-status-demand
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనజాగరణ సమితి ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్‌లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంట్‌లో హామీ ఇచ్చినప్పటికీ.... భాజపా ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వటంతో పాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.