విశాఖలో ఆ రెండు నియోజకవర్గాల ఫలితాలు ఆలస్యం - bheemili
దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విశాఖలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు .
విశాఖ జిల్లాలో ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలతో పాటు పోస్టల్ ,సర్వీస్ ఓట్లు కూడా లెక్కింపు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలోని ఐదు భవనాల్లో ఈ లెక్కింపు జరగనుంది. దీని కోసం 33 గదులు వినియోగిస్తున్నారు. 30 గదుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ లెక్కింపు జరుగుతుంది. 3 గదులు మాత్రం పోస్టల్ ,సర్వీస్ ఓట్ల లెక్కింపు చేస్తారు. లెక్కింపు కేంద్రాలు వద్ద సీఆర్ఫీఎఫ్ దళాలు గస్తీ కాస్తున్నాయి. 23వ తేదీ ఉదయం 5 గంటలకు కౌంటింగ్ సిబ్బంది హాజరవుతారు. అప్పుడే వారికీ ఏ టేబుల్‌కి వెళ్లాలనేది నిర్దేశిస్తారు. ఈ సారి వీవీ పాట్ లెక్కింపు ఉండడం వల్ల విశాఖలో.. 71.82 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 25.70 లక్షలు ఓటర్లు తీర్పు లెక్కించాలి. అరకు పార్లమెంట్ నియోజక వర్గం 4 జిల్లాలో లెక్కింపు జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ సెంటర్లో 14 టేబుల్ అసెంబ్లీ లెక్కింపునకు ... 14 టేబుల్స్ పార్లమెంట్ స్థానం లెక్కింపునకు వినియోగిస్తారు. వీవీ ప్యాట్ లెక్కింపునకు ఒక తాత్కాలిక మెస్ బాక్స్ లను ఏర్పాటు చేసి అందులో లెక్కించనున్నారు. భీమిలి నియోజకవర్గానికి సంబంధించి 23 రౌండ్ల లెక్కింపు జరగనుంది. అరకు నియోజకవర్గానికి 22 రౌండ్ల లెక్కింపు జరగుతుంది. దీని వల్ల ఈ రెండు నియోజకవర్గాల ఫలితాల విడుదలకు గరిష్ఠంగా 16 గంటలు సమయం పడుతుంది. ఇక కనిష్ఠంగా మాడుగుల, విశాఖ పశ్చిమ నియోజక వర్గాల ఫలితాల విడుదలకు 12 గంటల సమయం పడుతుందని అధికారుల అంచనా.