గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లాలో పాడేరు, నర్సీపట్నం, విశాఖ అటవీ డివిజన్లు ఉండగా...వీటిలో సుమారు 40 శాతం అటవీ భూభాగం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు చాలాకాలంగా వీటిపై ఆధారపడుతూ...పోడు భూములుగా సాగు చేసుకుంటున్నారు.
మన్యం ప్రాంతంలోని కొండ భూములకు పట్టాలు లేవు. ఇందుకోసం 2005లో అటవీ భూములపై చట్టం చేశారు. అప్పట్నుంచి ఆ చట్టం గిరిజనులకు వరంగా మారింది. 2008వ సంవత్సరం చట్టం కార్యరూపం దాల్చటంతో... ఇప్పటివరకూ 3 విడతల్లో 85వేల ఎకరాలకు పట్టాలిచ్చారు. దీంతో 38 వేల మంది గిరిజనులు లబ్ధి పొందారు.