ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వరూపానంద జన్మదిన వేడుకలు జరపాలని దేవదాయశాఖ ఆదేశాలు - vishaka swami swaroopananda

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదినం సందర్భంగా ఈ నెల‌ 18న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు మెమోలు జారీ చేసింది.

swami swaroopananda
swami swaroopananda

By

Published : Nov 13, 2020, 8:50 PM IST

Updated : Nov 13, 2020, 8:56 PM IST

నవంబర్ 18న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకలు జరపాలంటూ రాష్ట్ర దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని స్పష్టం చేసింది. అరసవెల్లి సూర్య దేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్ధం, సింహాచలం, కనకమహాలక్ష్మి ఆలయం, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానాల ఈవోలకు దేవదాయశాఖ అదనపు కమిషనర్ కె.రామచంద్రమోహన్ మెమోలు జారీ చేశారు. ఈ నెల 9న విశాఖ శారదా పీఠం మేనేజర్ రాసిన లేఖకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Last Updated : Nov 13, 2020, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details