ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో 'గ్రేట్'ర్ ఆలోచన... వినియోగంలోకి వృథా నీరు... - devarapalli

విశాఖ చరిత్రలో మరో ఘనత సాధించింది. జిల్లాలో మెుట్టమెుదటి సారిగా వృథాగా పోతున్న నీటిని పైపుల ద్వారా ఒడిసిపట్టి మరలా జలాశయంలోకి మళ్లించి వినియోగంలోకి తీసుకొస్తున్నారు. నీటి ఎద్దడి తగ్గిస్తున్నారు.

another greater record in vishaka

By

Published : Jun 29, 2019, 10:31 AM IST

రైవాడ జలాశయం

విశాఖ ప్రజలకు ఎన్నో ఏళ్లుగా రైవాడ జలాశయం తాగునీరు అందిస్తోంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయంలో నీటి మట్టం తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయిలో నిలిచింది. దీంతో గ్రేటర్ విశాఖ తాగునీరు అందించే కాలువ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. అధికారులు అప్రమత్తమై వృథాగా పోతున్న నీటిపై దృష్టి సారించారు. భారీ జనరేటర్ పెద్దపెద్ద పైపులను జలాశయం వద్ద ఏర్పాటు చేసి... వృథాగా పోతున్న నీటిని తోడి మరలా జలాశయంలో మళ్లిస్తున్నారు. ఇలా పైపుల ద్వారా 40 క్యూసెక్కుల నీటిని విశాఖకు వచ్చే కాలువలోకి రావడంతో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా చేయడం గ్రేటర్ విశాఖ చరిత్రలో మెుట్టమెుదటిసారి అని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details