ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి" - విశాఖ

ప్రభుత్వాలు మారినా అంగన్​వాడీల తలరాతలు మారడం లేదని అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   సుబ్బరామమ్మ ఆరోపించారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 8వ జిల్లా మహాసభలో ఆమె మాట్లాడారు.

శాఖలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

By

Published : Aug 19, 2019, 2:38 PM IST

విశాఖలో అంగన్వాడీ కార్యకర్తల సమావేశం

అంగన్​వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుబ్బరామమ్మ డిమాండ్ చేశారు. అంగన్​వాడీల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. అంగన్​వాడీలతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ... ప్రభుత్వ ఉద్యోగులుగా మాత్రం గుర్తించకపోవడం బాధాకరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details