వైద్యుడు సుధాకర్‌పై దాడిని చూసి వైద్యులంతా నిర్ఘాంతపోయామని జయధీర్ అన్నారు. వైద్యుడు సుధాకర్‌పై దాడిని ప్రభుత్వ వైద్యులుగా ఖండిస్తున్నామని తెలిపారు. గత నెల రోజుల నుంచి సుధాకర్ మానసిక క్షోభతో ఉన్నారన్న జయధీర్.. సుధాకర్ చేతులు వెనక్కికట్టిన వ్యవహరించిన తీరు మంచిది కాదని అభిప్రాయ వ్యక్తం చేశారు. పోలీసులపై న్యాయపరమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుధాకర్‌కు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్‌పైనా విచారణ చేపట్టాలని సుధీర్ కోరారు. సుధాకర్‌కు న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సీఎంపై వైద్యుడు సుధాకర్ వ్యాఖ్యలనూ ఖండిస్తున్నామని వెల్లడించారు.
'సుధాకర్‌కు న్యాయం జరగపోతే.. భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం' - సుధాకర్ అరెస్టుపై వైద్యుల సంఘం కామెంట్స్ న్యూస్
విశాఖ రోడ్లపై ప్రభుత్వ వైద్యుడిని అర్ధనగ్నంగా చూడటం బాధగా ఉందని... రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కన్వీనర్ జయధీర్ అన్నారు. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులపై ఇలాంటి ఘటన దారుణమన్నారు.
andhrapradesh governament doctors association on sudhakar arrest
TAGGED:
doctor sudhakar arrest news