ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 1, 2023, 9:58 PM IST

ETV Bharat / state

BJP: వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ దూకుడు.. ఛార్జిషీట్ పేరుతో ప్రజల్లోకి

BJP charge sheet: వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే ఛార్జిషీట్ రూపకల్పన పేరుతో... ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. అభియోగాలు నమోదులో ఎవరైతే బాధితులు ఉంటారో.. ఆయా సమస్యల ఆధారంగా వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని బీజేపీ నేతలకు సోము వీర్రాజు సూచించారు.

BJP charge sheet
సోమువీర్రాజు

BJP charge sheet రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి స్ధాయిలో ఇరుకున పెట్టేలా ప్రజా సమస్యలపై ఛార్జిషీట్ల రూపకల్పనకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. పదమూడు మంది సభ్యులతో కూడిన ఛార్జిషీట్ల రూపకల్పన... అమలు ప్రణాళిక కమిటీ సభ్యులు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. 18 అంశాలపై ఛార్జిషీట్ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ అసెంబ్లీ స్ధాయి నుంచి జిల్లా వరకు వివిధ దశల్లో ఛార్జిషీట్లు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అభియోగాలు నమోదులో ఎవరైతే బాధితులు ఉంటారో... ఆయా సమస్యల ఆధారంగా వారినుంచి ఫిర్యాదులు స్వీకరించాలన్నారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో జిల్లా అధ్యక్షులు తమ ప్రాంతాల్లో పర్యటించి అభియోగాల నమోదుతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశించారు.

ఈ కమిటీకి మార్గదర్శకుడిగా మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహరిస్తారని సోము వీర్రాజు వెల్లడించారు. అవసరమైతే బిగ్ స్క్రీన్ లు ఏర్పాటు చేసి అభియోగాలు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించాలన్నారు. అందుకు అవసరమైన మౌలిక అవసరాలను అందుబాటులోకి తీసుకొద్దామని సుజనాచౌదరి పేర్కొన్నారు. జోన్​ల వారీగా సమస్యలతో పాటు రాష్ట్ర స్ధాయిలో సమస్యలను క్రోడీకరించి ఛార్జిషీట్ బుక్ లెట్ ప్రచురించే అంశంపై చర్చించాలని తెలిపారు సుజనాచౌదరి. ఛార్జిషీట్ ఆధారంగా ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సీతకొండకు వైఎస్ఆర్ వ్యూ నామకరణంపై బీజేపీ ఆందోళన: ప్రభుత్వ ఆస్తులకు కాదు.. లోటస్ పాండుకు పేర్లు మార్చుకుని పెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ముఖ్యమంత్రికి సలహా ఇచ్చారు. విశాఖ నగరంలో టూరిజం పాయింట్​గా ఉన్న సీతకొండకు వైఎస్ఆర్ నామకరణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆందోళన చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. సీత కొండ పేరు మార్చడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. పార్టీ కార్యాలయంలో ఉన్న బీజేపీ, బీజేవైఎం నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పేరుమార్పును ఉపసంహరించుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

పివిఎన్ మాధవ్: స్టిక్కర్లు ప్రభుత్వంగా పేరు గాంచిన వైసీపి ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు పేర్లు మార్చే పనిలో పడింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న సీత కొండకు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా నామకరణాన్ని చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. పేరు మార్పునకు వ్యతిరేకంగా ఉధ్యమానికి పిలుపునిస్తే, విశాఖ పోలీసులు బీజేపీ నేతలను హౌస్ అరెస్టు చేశారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ వ్యూగా పేరు మార్చడంతో స్ధానికులు ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారు. ముఖ్య మంత్రికి పిచ్చి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details