ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తొలిసారి కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్న అనకాపల్లి వాసులు'

అనకాపల్లి ప్రజలు తొలిసారిగా కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్నారు. అనకాపల్లి మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనమై ఏడేళ్లు గడిచినా ఇంతవరకు జీవీఎంసీ ఎన్నికలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీవీఎంసీ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఫలితంగా మొదటిసారిగా కార్పొరేటర్లను ఎన్నుకునే అవకాశం అనకాపల్లి ప్రజలకు వచ్చింది.

తొలిసారి కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్న అనకాపల్లి వాసులు
తొలిసారి కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్న అనకాపల్లి వాసులు

By

Published : Mar 10, 2020, 12:00 AM IST

తొలిసారి కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్న అనకాపల్లి వాసులు

విశాఖ జిల్లా అనకాపల్లి పురపాలక సంఘాన్ని 1877లో ఏర్పాటు చేశారు. అనంతరం జీవీఎంసీలో 2013 జూలై 30న విలీనం చేశారు. ఇంతవరకు వార్డు కౌన్సిలర్​లను ఎన్నుకున్న ఓటర్లు ఇప్పుడు కార్పొరేటర్​లను ఎన్నుకోబోతున్నారు. అనకాపల్లి జీవీఎంసీని ఐదు వార్డులుగా విభజించారు. అయిదింటిని మహిళలకే కేటాయించారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి జోనల్​ కమిషనర్ శ్రీరామమూర్తి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు రావు గోపాలరావు కళా క్షేత్రాన్ని పరిశీలించారు. ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జీవీఎంసీ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details