విశాఖ తూర్పు నౌకాదళాన్ని తూర్పు పదాతి, వాయు కమాండ్ల అధిపతులు సోమవారం సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్‌తో వీరిద్దరూ భేటీ అయ్యారు. పలు రక్షణ పరమైన అంశాలపైనా, సన్నద్ధతలపైనా చర్చించారు. ఎయిర్ క్రాఫ్ట్ పీ-81, యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ పనితీరును పరిశీలించారు. ఎప్పడు ఎటువంటి అవసరం వచ్చినా త్రివిధ దళాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
'అవసరమైనప్పుడు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయి' - విశాఖ
ఎప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయనీ.. పరస్పరం సహకరించుకుంటూ దేశసేవలో నిమగ్నమవుతాయని పదాతి, వాయు, నౌకా దళాధిపతులు తెలిపారు. విశాఖలో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు పదాతి, వాయు దళాధిపతులు విశాఖ తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు.
'అవసరమైనప్పుడు త్రివిధ దళాలు కలిసి పనిచేస్తాయి'