ఐస్ క్రీం తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం - fine
సరైన ప్రమాణాలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐస్‌క్రీం తయారీ కేంద్రాల యజమానులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
ఫుడ్ సేఫ్టీ అధికారులు ఐస్‌క్రీం తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న తయారీ కేంద్రాలపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. గత నెల 26, 29 తేదీల్లో ఐస్‌క్రీం తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఐస్‌క్రీంలను తయారు చేస్తున్నట్లు గుర్తించి.. యజమానులపై కేసులు నమోదు చేశారు. శ్రీ సాయి మిల్క్ ప్రొడక్ట్స్, విజయదుర్గ ప్రొజెన్ ఫుడ్స్, శ్రీ గురు వెంకటేశ్వర ఫుడ్ ప్రొడక్ట్స్లకు ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చొప్పున జాయింట్ కలెక్టర్ జరిమానా విధించారు.